GDWL: విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని బహుజన రాజ్య సమితి నేతలు వాల్మీకి, కోళ్ల హుస్సేన్ కోరారు. గద్వాలలో శుక్రవారం జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. ఫీజులు చెల్లించలేక పేద విద్యార్థులు, తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. బకాయిలు ఇవ్వకపోతే విద్యార్థులు చదువును వదిలే పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.