SKLM: ఎచ్చెర్లలో ఉన్న ఆర్జీయూకేటీ ఎచ్చెర్ల ఐఐఐటీ నూతన డైరెక్టర్గా ఐఐటీ హైదరాబాద్ ప్రొఫెసర్ గిరిధర్ మద్రాస్ మంగళవారం బాధ్యతలు చేపట్టారు. భట్నాగర్ అవార్డు గ్రహీత, ప్రపంచ టాప్-100 కెమికల్ ఇంజినీరింగ్ శాస్త్రవేత్తల్లో ఒకరైన ఆయనను రిజిస్ట్రార్ అమరేంద్ర కుమార్ అభినందించారు. కార్యక్రమంలో ఏఓ, డీన్, సిబ్బంది పాల్గొన్నారు.