CTR: భారత ప్రముఖ వెయిట్‌లిఫ్టింగ్ క్రీడాకారిణి కరణం మల్లేశ్వరి శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దేవస్థానం ఛైర్మన్ మణి నాయుడు, ఈవో పెంచల కిషోర్ ఆమెకు ఘన స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రం, చిత్రపటం అందజేశారు.