GNTR: ఫిరంగిపురం మండలం నుదురుపాడు గ్రామ సచివాలయాన్ని డీపీవో నాగ సాయి కుమార్ గురువారం అకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు పట్టీలను పరిశీలించి, వారి విధి నిర్వహణపై ఆరా తీశారు. అనంతరం అంగన్వాడీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సందర్శించి సేవల వివరాలను తెలుసుకున్నారు. సచివాలయానికి వచ్చిన స్థానిక ప్రజలతో నేరుగా మాట్లాడి సిబ్బంది పనితీరు తెలుసుకున్నారు.