CTR: ఎపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరోగ్యం మెరుగుపడాలని కోరుతూ గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటినగరం మండలం శుద్ధగుంట గ్రామంలోని ఆదిపరాశక్తి రేణుక మాతమ్మ ఆలయంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యుగంధర్ పొన్న ముఖ్య అతిథిగా హాజరై, పలువురు టీడీపీ, జనసేన నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.