NTR: నందిగామ గాంధీ సెంటర్లో వడదెబ్బ నివారణకు ఉచిత హోమియో మందుల పంపిణీ శిబిరం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య శిబిరాన్ని సందర్శించి ప్రజలకు స్వయంగా మందులు పంపిణీ చేశారు. పెరుగుతున్న ఎండల నేపథ్యంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు అవసరమని తెలిపారు. సేవా సంస్థల పాత్రను ఆమె అభినందించారు.