KRNL: ప్రజల దాహార్తిని తీర్చేందుకు శుద్ధజలాన్ని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పత్తికొండ MLA శ్యాంబాబు అన్నారు. సోమవారం వెల్దుర్తిలోని బ్రహ్మగుండం రహదారిపై ఉన్న ఎన్టీఆర్ శుద్ధ జల కేంద్రాన్ని ఆయన పున:ప్రారంభించారు. ఈ సందర్భంగా MLA మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాలకు తక్కువ ధరకు శుద్ధ జలాన్ని అందించడం కోసం వీటిని ప్రారంభిస్తున్నామన్నారు.