ASR: గిరిజనులను అవమానించేలా వ్యాఖ్యలు చేసిన ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందళం అశోక్ వెంటనే రాజీనామా చేయాలని ఆదివాసి కాంగ్రెస్ రాష్ట్ర కోఆర్డినేటర్ తెలగంజి సోమేశ్వరరావు డిమాండ్ చేశారు. అరకులోయ కాంగ్రెస్ కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే అసభ్య పదజాలం ఉపయోగించడం దురదృష్టకరమని పేర్కొన్నారు. అతనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరారు.