గుంటూరు మహిళా ప్రాంగణానికి బ్యాంకు ఆఫ్ ఇండియా మహిళ ఉద్యోగులు రూ. 94 వేల విలువైన సామగ్రిని అందజేశారు. మహిళా దినోత్సవం సందర్భంగా సమకూర్చిన నిధులతో సీ.ఎస్.ఆర్ కార్యక్రమం క్రింద ఈ వితరణ జరిగింది. కుర్చీలు, మంచాలు, పడకలు, వాటర్ ప్యూరిఫైయర్లు వంటి అవసరమైన సామగ్రిని ప్రాంగణానికి అందించారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు అభినందనీయమని అదనపు ఎస్పీ సుప్రజ తెలిపారు.