GNTR: నిర్వహణ పనుల కారణంగా నేడు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదని డీఈఈ రాజమోహన్ తెలిపారు. హౌసింగ్ బోర్డు కాలనీ, నల్లపాడు, వెంగళాయపాలెం, పెద పలకలూరు, మల్లవరం, అడవితక్కెళ్ళపాడు, స్వర్ణభారతీనగర్ తదితర ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడనుంది. ఈ అంతరాయానికి వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.