GNTR: తుళ్లూరు ఎక్స్చేంజ్ సెంటర్లోని మీసేవ కేంద్రంలో కార్మికుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫోన్ నంబర్ లింక్ సేవకు రూ. 70 బదులు రూ. 250 వరకు తీసుకుంటున్నారని, రసీదుల్లో అసలు మొత్తం చూపించడం లేదని కార్మికులు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.