కృష్ణా: సత్య సాయి సేవా సంస్థలు యువజన విభాగం ఆధ్వర్యంలో ప్రతి సోమవారం మచిలీపట్నం కలెక్టరేట్ కార్యాలయంలో సుమారు 300 మందికి పైగా అర్జీదారులకు సాయి ప్రోటీన్ ఫుడ్‌ను పంపిణీ చేస్తున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సత్య సాయి సేవా సంస్థలు స్వచ్ఛందంగా, నిస్వార్థ భావంతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయన్నారు. సమాజ సేవలో యువత ముందుండటం అభినందనీయమన్నారు.