తూ.గో: ప్రభుత్వం అమలు చేస్తున్న దివ్యాంగశక్తి పథకం ద్వారా దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ఇవాళ ప్రారంభించనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. మంగళవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి అధికారులతో దివ్యాంగశక్తి పథకంపై టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి దిశానిర్దేశం చేశారు. రాష్ట్రస్థాయిలో ఈ పథకాన్ని సీఎం ప్రారంభిస్తారన్నారు.