ASR: రాజవొమ్మంగి మండలంలోని కమ్మరిపేట శివారులో ఉన్న విడివికె గోదాంలో నిల్వ ఉంచిన 19 బస్తాల జీడిపిక్కల చోరీ కేసును పోలీసులుల ఛేదించారు. ఈ ఘటనకు సంబంధించి ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు జడ్డంగి SI చిన్నబాబు తెలిపారు. స్థానిక వెలుగు ఏపీఎం రామాంజనేయులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ప్రత్యేక దర్యాప్తు చేపట్టి ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు.