అన్నమయ్య: టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు గురువారం నందలూరు ఎంపీడీవో కార్యాలయంలో సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టిన ‘దివ్యాంగ శక్తి’ పథకం వికలాంగులకు వరమని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దివ్యాంగుల ఇబ్బందులు తగ్గించేందుకు తెదేపా నాయకులే స్వయంగా వారి ఇళ్లకు వెళ్లి పత్రాలు సేకరించి, ఆర్టీసీ అధికారుల ద్వారా పాసులు సిద్ధం చేయించారని తెలిపారు.