అనంతపురం: దివ్యాంగ నిరుద్యోగులకు స్వయం ఉపాధి కోర్సులో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు దివ్యాంగుల సమస్య కోఆర్డినేటర్ నాగరాజు తెలిపారు. 3 నెలలపాటు బేసిక్, కంప్యూటర్ స్కిల్స్ కమ్యూనికేషన్స్ స్కిల్స్లో శిక్షణ ఇస్తామన్నారు. టెన్త్ పాస్ అయి 18-35 ఏళ్ల దివ్యాంగులు అర్హులన్నారు. ఉచిత వసతి, భోజనం సదుపాయం కల్పిస్తామన్నారు. 6364863217 నెంబర్కు సంప్రదించాలన్నారు.