KDP: జిల్లాలో ఖాళీగా ఉన్న తహసీల్దార్ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తైంది. జోన్-4 పరిధిలో డిప్యూటీ తహసీల్దార్ల నుంచి తహసీల్దార్లుగా (కేటగిరీ-3) పదోన్నతి పొందిన 18 మంది అధికారులకు పోస్టింగులు ఇస్తూ.. కలెక్టర్ శ్రీధర్ గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. సింహాద్రిపురం,వేముల, వేంపల్లి, బద్వేలు, బి.మఠం, నందలూరు తదితర మండలాలకు కొత్త తహసీల్దార్లు నియమితులయ్యారు.