పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని విశాఖ ప్రజలు సింగల్ యూజ్ ప్లాస్టిక్కు స్వస్తి పలకాలని జీవీఎంసీ కమిషనర్ కేతాన్ గార్గ్ పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ వినియోగించి మన ప్రాణాలకే ముప్పు తెచ్చుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. ప్లాస్టిక్ కవర్ల వల్ల జలరాసులు, జీవరాసులు, మూగజీవులు అంతరించిపోతున్నాయని వివరించారు.