HNK: కాజీపేట దర్గా రోడ్డులోని పీఎఫ్ కార్యాలయం ఎదుట శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు గాయపడ్డారు. బైక్ అదుపుతప్పి పడిపోవడంతో రాజేశ్, అనిరుధ్, తరుణ్ గాయాలపాలయ్యారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం వారిని మెరుగైన చికిత్స కోసం ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.