HNK: హన్మకొండ నగరంలోని కాకతీయ యూనివర్సిటీ (కేయూ) హాస్టళ్లలో మెస్ నిర్వహణ, టెండర్లు లేకుండా కొనుగోళ్లు, నిబంధనలకు విరుద్ధంగా అడ్వాన్సుల చెల్లింపుల్లో అవకతవకలు జరిగినట్లు విచారణ కమిటీలు గుర్తించాయి. రెండు నెలల్లోనే సుమారు రూ. 23 లక్షల అడ్వాన్సులు చెల్లించినట్లు తేలింది. ఈ నేపథ్యంలో మాజీ హాస్టల్ డైరెక్టర్ సహా 18 మందికి రిజిస్ట్రార్ షోకాజ్ నోటీసులు జారీ.