JGL: జగిత్యాల పట్టణంలో పేకాటరాయుళ్లను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ కరుణాకర్ తెలిపారు. పక్కాసమాచారం మేరకు పట్టణంలోని కరీంనగర్ రోడ్డులో ఓ ఇంటిలో పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు దాడులు చేశారు. ఈ సందర్భంగా ఐదుగురు పేకాట ఆడుతూ పట్టుపడగా వారివద్ద రూ. 57వేల నగదుతో పాటు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.