SKLM: నరసన్నపేట మండల పరిషత్ కోఆప్షన్ సభ్యుడు, లయన్స్ రీజినల్ ఛైర్మన్గా రమణ సాహూ ఎంపికయ్యారు. దీంతో ఆయనను పలువురు అభినందించారు. అతి చిన్న వయసులోనే రీజనల్ ఛైర్మన్ ఎంపిక కావడం అభినందనీయమని సభ్యులు పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం నరసన్నపేటలో మిత్ర బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆయనకు శాలువా కప్పి సత్కరించారు.