W.G: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జిల్లాలో పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలను విస్తృత స్థాయిలో నిర్వహించాలని జిల్లా ఇంఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పిలుపునిచ్చారు. అధికారులు, ఉద్యోగులు సాధ్యమైనంత వరకు తమ కార్యాలయాలకు సైకిళ్లు లేదా పర్యావరణహిత (ఎలక్ట్రిక్) వాహనాల ద్వారా వచ్చి ఆదర్శంగా నిలవాలని సూచించారు.