నంద్యాల: మహానంది ఈశ్వర్ నగర్ కాలనీలో అక్రమంగా చర్చి నిర్మాణం జరుగుతోందని బీజేపీ, వీహెచ్‌పీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అధికారులకు ఫిర్యాదు చేశారు. సోమవారం రాజశేఖర్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి బృందం VRO చలమయ్య, కార్యదర్శి భాస్కర్‌కు వినతిపత్రం ఇచ్చారు. దేవాలయ పరిధిలో ఇతర మత నిర్మాణాలకు అనుమతి ఇవ్వొద్దని, తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.