W.G: భీమవరంలోని శ్రీ ఆదిత్య డిగ్రీ కళాశాలలో ఈ నెల 27న నిర్వహించనున్న మెగా ప్లేస్మెంట్ డ్రైవ్‌ను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. మంగళవారం భీమవరం కలెక్టరేట్లో ఇందుకు సంబంధించిన గోడపత్రికలను ఆమె ఆవిష్కరించారు. ఈ మేళాలో సుమారు 21 ప్రముఖ కంపెనీలు పాల్గొని ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నాయని, అర్హులైన అభ్యర్థులు హాజరు కావాలన్నారు.