ATP: అనంతపురం కలెక్టరేట్లో వ్యవసాయ, అనుబంధ రంగాల అధికారులతో జిల్లా కలెక్టర్ ఆనంద్ బుధవారం సమీక్ష నిర్వహించారు. రైతు రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని, ఏపీఎంఐపీ ద్వారా మంజూరైన డ్రిప్ పరికరాలను తక్షణమే పంపిణీ చేయాలని ఆదేశించారు. తక్కువ ఖర్చుతో అధిక దిగుబడినిచ్చే ఫర్టిగేషన్ పద్ధతిపై రైతులకు శిక్షణ ఇవ్వాలని సూచించారు.