CTR: గంగాధర్ నెల్లూరు మండలం అప్పిరెడ్డి కండిగ సమీపంలో ఆదివారం రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురికి గాయాలు కాగా, వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న అత్యవసర సిబ్బంది గాయపడిన వారిని 108 అంబులెన్స్ ద్వారా చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.