విశాఖలో జీవీఎంసీ కార్యాలయం అవుట్ గేట్ సమీపంలోని పలు బిర్యానీ, పులావ్ షాపులపై ఆహార భద్రతాధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ దాడుల్లో 14 రకాల ఆహార నమూనాలు సేకరించారు. కొన్ని చోట్ల అపరిశుభ్ర పరిస్థితులు గుర్తించడంతో యజమానులకు నోటీసులు జారీ చేసినట్లు అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ కల్యాణ చక్రవర్తి తెలిపారు.