అన్నమయ్య: నిమ్మనపల్లి మండలం రెడ్డివారిపల్లి గ్రామంలో చేపడుతున్న జలధార పనులను జేసీ శర్మ పరిశీలించారు. పనుల నాణ్యత, నీటి నిల్వ ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం బహుదా డ్యాంను సందర్శించి నీటి నిల్వ సామర్థ్యం, కాలువల పరిస్థితిని పరిశీలించిన ఆయన, వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని జల వనరుల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.