BPT: రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి శ్రీ గొట్టిపాటి రవికుమార్ ఇవాళ సంతమాగులూరు మండలంలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు సంతమాగులూరులో నిర్వహించే అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొని, ఆయనకు నివాళులర్పిస్తారు. అనంతరం నెహ్రూనగర్‌లో నూతన బీటీ రోడ్డును, అలాగే ‘పి.ఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’ (ఉచిత సోలార్ విద్యుత్) పథకాన్ని ప్రారంభించనున్నారు.