ELR: జిల్లాలో ఆక్వా సాగు చేసే చెరువులన్నీ ‘ఏపి సడా’ చట్టం కింద నమోదు కావాలని కలెక్టర్ వెట్రిసెల్వి చెప్పారు. ఏలూరు కలెక్టరేట్లో శుక్రవారం రెవిన్యూ, మత్స్య శాఖాధికారులతో కలెక్టర్ సమీక్షించారు. జిల్లాలో ఏపి సడా చట్టం కింద 64,193 ఎకరాలు నమోదు చేయవలసి ఉండగా, ఇంతవరకు కేవలం 4,693 ఎకరాలు మాత్రమే నమోదు కావడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.