అన్నమయ్య: చిట్వేలిలోని శ్రీ భక్త ఆంజనేయస్వామి దేవస్థానం అభివృద్ధికి రిటైర్డ్ ఎంఈఓ డొనేల రవీంద్ర రూ.1లక్ష విరాళం గురువారం అందించారు. ఆలయ ప్రాంగణంలో భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక గది నిర్మాణానికి ఈ మొత్తాన్ని సమర్పించారు. తన తండ్రి డొనేల పెంచలయ్య జ్ఞాపకార్థంగా ఈ సేవ చేయడం ఆనందంగా ఉందని, పురాతన ఆలయాలను సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.