KRNL: సూపర్ సిక్స్‌లో ఇచ్చిన హామీలను తూచ తప్పకుండా అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని టీడీపీ మంత్రాలయం ఇంఛార్జ్ రాఘవేంద్ర రెడ్డి, రాష్ట్ర రైతు అధికార ప్రతినిధి రమాకాంత్ రెడ్డి అన్నారు. నిన్న రంగాపురంలో రైతన్న సేవలో మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి అన్నదాత సుఖీభవ పథకం అమలు తీరును అడిగి తెలుసుకున్నారు.