GNTR: సీపీఐ శత వార్షికోత్సవాల ముగింపు సందర్భంగా ఖమ్మంలో నిర్వహించనున్న లక్షమంది వాలంటీర్ల కవాతుకు ఏర్పాట్లలో భాగంగా గుంటూరులో జనసేవాదళ్ శిక్షణ శిబిరం ఆదివారం ప్రారంభమైంది. సీపీఐ జాతీయ సమితి సభ్యులు ముప్పాళ్ల నాగేశ్వరరావు శిబిరాన్ని ప్రారంభించారు. వాలంటీర్లలో క్రమశిక్షణ, సేవాభావం పెంపొందించడమే లక్ష్యంగా ఈ శిక్షణ నిర్వహిస్తున్నట్లు నాయకులు తెలిపారు.