NGKL: ఊర్కొండ మండలం గుండ్లగుంట పల్లి పంచాయతీ పరిధిలోని రెడ్యా తండాలో ఉపాధి హామీ కింద నిర్మిస్తున్న సీసీ రోడ్లను పంచాయతీరాజ్ డీఈఈ బసవలింగం మంగళవారం పరిశీలించారు. గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించే రోడ్లు అత్యంత నాణ్యతతో ఉండాలని, పనుల్లో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించవద్దని అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల సంఘం అధ్యక్షుడు రమేశ్ నాయక్ పాల్గొన్నారు.