ATP: పెద్దవడుగూరు పరిధిలోని పందులవాగు వంకలో రూ.30 లక్షలతో 3 కిలోమీటర్ల మేర ఫీడర్ చానెల్ పూడికతీత పనులు వేగవంతంగా సాగుతున్నాయి. జలధార-జలహారతి కార్యక్రమంలో భాగంగా డ్వామా ఆధ్వర్యంలో ఈ పనులు చేపట్టారు. దీనివల్ల వర్షపు నీరు వృధా కాకుండా చెరువులు నిండటంతో పాటు భూగర్భ జలాలు పెరుగుతాయని ఏపీడీ ఆయేషా తెలిపారు.