NLR: నాలుగు దశాబ్దాలుగా మూడు తరాలు ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబుతో కలిసి పనిచేసిన అదృష్టం తనకు దక్కిందని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవంలో సోమిరెడ్డి పాల్గొన్నారు. ఎన్టీ రామారావు సృష్టించిన పార్టీ టీడీపీ అని అన్నారు. ఓడినా గెలిచినా కష్టం వచ్చినా పార్టీని మాత్రం వీడలేదని ఆయన పేర్కొన్నారు.