KRNL: కర్నూలు ప్రభుత్వ డిగ్రీ కళాశాల (మెన్)లో ఇవాళ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ ఇందిరా శాంతి తెలిపారు. ఈ మేళాలో పలు కంపెనీలకు చెందిన 630 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తారని పేర్కొన్నారు. పదో తరగతి నుంచి ఫార్మసీ వరకు చదివి, 18 నుంచి 45 ఏళ్లలోపు వయస్సు వారు అర్హులని వెల్లడించారు. ఆసక్తి గల అభ్యర్థులు ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూలకు హాజరు కావాలని కోరారు.