TPT: పాకాల టౌన్ కమ్మవీధికి చెందిన వెంకన్న (40) ఆదివారం ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తిరుమలలో కూలీ పనులు చేస్తూ జీవించేవాడు. కుటుంబ సభ్యులు ఎవరూ లేక బాడుగ ఇంటిలో నివసించేవాడు. అనారోగ్యంతో పాటు జీవితం మీద విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.