ATP: వెలగపూడి సచివాలయంలో గురువారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం నియోజకవర్గంలోని మూడు మండలాలకు సంబంధించిన కాలువల కల్వర్టులకు సంబంధించిన వివిధ అంశాలను డిప్యూటీ సీఎం దగ్గర ప్రస్తావించారు. నిధులు విడుదల చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.