కోట్లాది మంది ప్రైవేట్ ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ గొప్ప ఊరటనిచ్చే వార్త అందించింది. పీఎఫ్ ఉపసంహరణలో జాప్యాన్ని నివారిస్తూ కొత్తగా ‘ఆటో-సెటిల్మెంట్’ విధానాన్ని తీసుకొచ్చింది. ఇకపై అధికారుల ప్రమేయం లేకుండా సాఫ్ట్వేర్ ద్వారానే దరఖాస్తులు వెరిఫై అయ్యి నగదు వేగంగా జమ అవుతుంది. ఇందుకోసం ఖాతాదారులు ఆధార్, బ్యాంక్ కేవైసీ అప్డేట్ చేసుకోవాలి.