KRNL: ఆదోని పట్టణ శివారు కొండపై వెలిసిన శివ మారుతి స్వామి ఆలయ ఆవరణంలో 54 అడుగుల ఆంజనేయస్వామి విగ్రహ నిర్మాణానికి విశ్వహిందూ పరిషత్ నాయకులు విరాళం అందజేశారు. ఉగాది పండగను పురస్కరించుకుని స్థానిక విశ్వహిందూ పరిషత్ కార్యాలయ ఆవరణంలో ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు. అనంతరం శివ మారుతి ఆలయ నిర్వాహకులకు విగ్రహ నిర్మాణానికి రూ.2 లక్షల విరాళం అందజేశారు.