KRNL: దేవనకొండకు చెందిన మాధవ్ విద్యార్థి ఉద్యమాల నుంచి ఎదిగి డాక్టరేట్ సాధించడం అభినందనీయమని సీపీఐ నాయకులు పేర్కొన్నారు. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ప్రభుత్వ పాఠశాలల పనితీరుపై పరిశోధన చేసి డాక్టరేట్ పొందారు. విద్యార్థి హక్కులు, స్కాలర్షిప్లు, హాస్టల్ సమస్యలపై అనేక ఉద్యమాలకు ఆయన నాయకత్వం వహించి, యువతకు ఆదర్శంగా నిలిచారని నాయకులు కొనియాడారు.