KDP: ప్రొద్దుటూరు నియోజకవర్గంలో 3,007 ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఉచిత సౌర విద్యుత్ అందించనున్నట్లు స్థానిక MLA నంద్యాల వరదరాజులరెడ్డి తెలిపారు. ఆయన ఇవాళ ప్రొద్దుటూరులో పీఎం సూర్యఘర్ ఉత్సవ్ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గంలో సుమారు రూ.35 కోట్లతో ఎస్సీ, ఎస్టీలకు రూప్‌టాప్ సోలార్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.