GNTR: హోలీ పండుగ రద్దీ దృష్ట్యా గుంటూరు మీదుగా ప్రయాణించే ప్రయాణికుల కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది.శనివారం రాత్రి నుంచి ప్రారంభమయ్యే ఈ రైళ్లు మార్చి 12వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయి. ఇందులో చర్లపల్లి-ధనాపూర్, మచిలీపట్నం-జగదల్పూర్, యశ్వంత్పూర్-సత్రగంజి, పొదనూర్-బరౌని మధ్య ప్రత్యేక సర్వీసులు ఉన్నాయని అధికారులు తెలిపారు.