VSP: వాల్తేర్ డివిజన్లో శిలిమ్లిగూడ–కరకవలస మధ్య డబుల్ లైన్ పనుల కారణంగా నాన్-ఇంటర్లాకింగ్ పనులు చేపడుతున్నారు. దీంతో విశాఖపట్నం–కిరండూల్ మధ్య నడిచే 58501, 58502 ప్యాసింజర్ రైళ్లు మార్చి 5 నుంచి 14/15 వరకు తాత్కాలికంగా రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికులు ముందస్తుగా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.