బాపట్ల: మార్టూరు మండలాన్ని ఏపీ పంచాయతీరాజ్ కమిషనర్ ఎమ్. కృష్ణతేజ శనివారం సందర్శించారు. గ్రామ పంచాయతీల్లో గృహ పన్ను వసూళ్ల పురోగతిని అధికారులతో కలిసి సమీక్షించారు. బకాయిల వసూళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టి లక్ష్యాలను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ప్రజలకు అవగాహన కల్పిస్తూ పారదర్శకంగా పన్నులు వసూలు చేయాలని అధికారులను ఆదేశించారు.