VSP: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ ఈ నెల 6న విశాఖలో పర్యటించనున్నారు. విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో విశాఖ చేరుకుని, భీమునిపట్నం మండలం తగరపువలసలోని ఎన్ఆర్ఐ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 6వ కాన్వొకేషన్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. అనంతరం అదే రోజు రాత్రికి విజయవాడకు తిరుగు ప్రయాణం కానున్నారు.