కృష్ణా: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, జ్ఞానేశ్వరి దంపతులు సోమవారం దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శనం ద్వారా స్వామివారి సేవలో పాల్గొని, అనంతరం వేదపండితుల ఆశీర్వచనం, తీర్థప్రసాదాలు స్వీకరించారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా శ్రీవారి దర్శనం చేసుకున్నట్లు తెలిపారు.