సత్యసాయి: బత్తలపల్లిలో ‘మన ఊరు – మన జెండా’ కార్యక్రమ విజయవంతంపై ముఖ్య సమావేశం సోమవారం జరిగింది. నియోజకవర్గ బీజేపీ ఇంచార్జ్ హరీష్ బాబు అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ఇంటింటికీ వివరించాలని కార్యకర్తలకు సూచించారు.